సీఎం జగన్‌కి లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు.. ఏమడిగాడో తెలుసా..!

Wednesday, June 5th, 2019, 04:33:23 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒక లేఖ రాశారు. తన అధికార నివాసంకు దగ్గరగా ఉన్న కృష్ణ కరకట్ట ప్రాంతంలోని ప్రజావేదిక భవనాన్ని తమ పార్టీ యొక్క అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని ఆయన పేర్కొన్న లేఖలో తమ వినతిని సమర్పించారు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా తనను కలవడానికి చాలా మంది జనం వస్తుంటారని అందువల్ల ప్రజావేదిక భవనాన్ని తమకు కేటాయించాలని చంద్రబాబు కోరారట.

అంతేకాదు యాజమాన్యం షరతుల మేరకు ప్రస్తుతం తాను ఉంటున్న నివాసంలోనే తాను కొనసాగుతానని దానికి అనుబంధంగా ప్రజావేదిక ఉండడంతో అది మాకు కేటాయించవలసిందిగా చంద్రబాబు జగన్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు నేడు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల గురించి, ప్రజా వేదిక గురించి మరియు పలు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తుంది.