ఆ మాటే ఓ పెద్ద అబద్ధం.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్..!

Sunday, May 31st, 2020, 12:04:57 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు పింఛన్ ఇస్తామని చెప్పిన పెద్దమనిషి ఏకంగా శాసనసభలోనే నేనలా అనలేదు అనడం ఎంత పెద్ద మోసం! ఏడాదికాలంలో ఇలా రోజుకో మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇకనైనా పాలకులు వెనుకటి బుద్ధులు మానుకోవాలని విమర్శించారు.

అంతేకాదు రైతు భరోసా విషయానికే వస్తే ఏడాదికి ప్రతి రైతు కుటుంబానికీ 12500 రూపాయలు ఇస్తానన్నారు. తర్వాత 6,500లే అన్నారు. తెలుగుదేశం గట్టిగా అడిగితే ఇంకో వెయ్యి పెంచి 7500లు చేసారు. ఇదొక మోసం. పోనీ అదైనా అందరికీ ఇచ్చారా అంటే సగం మంది రైతులకే ఇస్తున్నారు. ఎంత మోసం అని ఇలా వంద మాటలు చెప్పి అందులో ఒక్క అబద్దం ఆడితేనే ఆ వ్యక్తి మీద అబద్దాల కోరు అనే ముద్ర పడిపోతుంది. అలాంటిది వందకు వంద శాతం అబద్ధాలే మాట్లాడేవాళ్ళ సంగతి ఏంటి అని వైసీపీ పాలకులు ఆ కోవలోకే వస్తారు. అసలు మాట తప్పం, మడమ తిప్పం అనే మాటే ఒక పెద్ద అబద్ధం అని ఎద్దేవా చేశారు.