బిగ్ బ్రేకింగ్ : ఎన్టీఆర్ తో బాబు భేటీ..నువ్వు రావాల్సిందే..?

Monday, August 19th, 2019, 11:48:34 AM IST

టీడీపీ పార్టీ కష్టకాలంలో ఉందనే విషయం ప్రతి తెలుగువాడికి బాగా తెలుసు. పార్టీని మొదటి నుండి భుజాల మీద మోస్తున్న టీడీపీ శ్రేణులకు ఈ పరిస్థితి జీర్ణించుకోవటం కష్టంగా వుంది. ఎలాగైనా సరే టీడీపీకి తిరిగి పూర్వ వైభవం తీసుకోని రావాలని చూస్తున్నారు. ఇందుకోసం ఎంత కష్టమైన భరించటానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా చంద్రబాబుకి కూడా ప్రస్తుతం తన సత్తా ఏమిటో, తన లోకేశుడి సత్తా ఏమిటో, పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో బాగా తెలుసు, ఆయన కూడా పార్టీకి తిరిగి వైభవం తీసుకోని రావాలని గట్టిగానే చూస్తున్నాడు.

అయితే ఒక పక్క కొండ లాంటి జగన్ ని, మరో పక్క బల్లెం పవన్ ని తట్టుకొని నిలబడగలిగే సత్తా తనకి లేదని బాబుకి తెలుస్తుంది. దీనితో టీడీపీకి యువ రక్తం రావాలని మొన్నటి సమావేశంలో పార్టీ సీనియర్లు చేసిన సలహాని బాబు పాటిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీని లీడ్ చేసే సత్తా కలిగిన నేత కావాలని టీడీపీ చూస్తుంది. ఆ విధంగా చూసుకుంటే దానికి సరైన అర్హత కలిగిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే, అందులో ఎలాంటి సందేహ లేదు. ఎన్టీఆర్ మద్దతు ఉంటేనే మళ్ళీ టీడీపీకి పూర్వ వైభవం వస్తుందనేది అందరి అభిప్రాయం.

బాబు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో ఎన్టీఆర్ ని దువ్వే పనిలో పడ్డట్లు తెలుస్తుంది. నిన్నటికి నిన్న హరికృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా బాబు హరికృష్ణ ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా బాబుని ఎదురొచ్చి లోపలకి తీసుకోని వెళ్లారు. ఆ సమయంలో బాబు కూడా ఎన్టీఆర్ తో ఎక్కువగా మాట్లాడినట్లు తెలుస్తుంది. పార్టీ గురించి కూడా చర్చకి వచ్చినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కి ప్రస్తుత టీడీపీ పార్టీ పరిస్థితి చుస్తే బాధగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం బాబుతో ఎన్టీఆర్ చెప్పినట్లు తెలుస్తుంది.

పైన జరిగిన వాటిని గమనిస్తే బాబు మళ్ళీ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకోని వచ్చే ప్రక్రియకి తెర లేపినట్లు తెలుస్తుంది. మరి ఈసారి గతంలో మాదిరి అవసరానికి వాడుకొని పక్కన పెడుతాడో, లేక పక్కన కూర్చోబెట్టుకొని పదవులు ఇస్తాడో చూడాలి. అయితే ఎన్టీఆర్ గతంలో మాదిరి మోసపోవడానికి మాత్రం సిద్ధంగా లేదనేది నిజం.కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనేది ఎన్టీఆర్ ఆలోచనగా తెలుస్తుంది.