చంద్రబాబు మాట్లాడిన ఒకే ఒక్క మాటకి సహనం కోల్పోయిన జగన్

Thursday, June 13th, 2019, 05:42:48 PM IST

ఆంధ్ర అసెంబ్లీలో భయంకరమైన వేడి వేడి మాటల తూటాలు పేలుతున్నాయి. స్పీకర్ ఎన్నికపై శుభాకాంక్షలు తెలపాల్సిన సమయంలో ఇరు పక్షాలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల గురించి పెద్ద ఎత్తున చర్చ అసెంబ్లీలో జరుగుతుంది. 23 MLA లను ముగ్గురు MP లను అన్యాయంగా తీసుకున్నారు. ఇప్పుడు పైనున్న దేవుడు మీకు అదే 23 MLA లను ముగ్గురు MP లను ఇచ్చాడు. ఇప్పుడు మీలాగా మేము కూడా వలసలకు పచ్చ జెండా ఊపితే మీకు ప్రతిపక్షము హోదా కూడా దక్కదు. అది గుర్తుపెట్టుకొని సభలో వ్యవహరించాడని స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని హెచ్చరించటం జరిగింది.

దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ 1978 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు “రెడ్డి కాంగ్రెస్” తరుపున గెలిచి పట్టుమని పదిరోజులు కూడా ఉండకుండా “ఇందిరా కాంగ్రెస్” లోకి వచ్చాడు. ఆ తర్వాత 2009 లో 11 మంది తెలుగుదేశం MLA లను కాంగ్రెస్ లోకి చేర్చుకున్నారు అది మీకు గుర్తులేదా..? తండ్రికి తగ్గ తనయుడిని అంటూ చెప్పుకునే మీరు ఆనాడు మీ తండ్రి చేసింది తప్పు అని ఒప్పుకో.. అంటూ మాట్లాడాడు. దీనితో ఒక్కసారిగా అసెంబ్లీ హాల్ లో అలజడి రేగింది.అధికార పక్ష సభ్యులు పెద్ద ఎత్తున అరవటం స్టార్ట్ చేశారు. స్పీకర్ మాట కూడా వినకుండా గోల గోల చేస్తున్నారు.

ఇక చంద్రబాబు మాటలకి అసహనంతో ఉన్న జగన్ మాట్లాడుతూ, నేను పార్టీ పెట్టి మొదటిసారి అసెంబ్లీ కి వచ్చింది 2014 లో, అప్పటి విషయాలు మాట్లాడమంటే ఎప్పుడో పూర్వకాలంలో జరిగిన వాటిని తీసుకోని వచ్చి మాట్లాడటం ఏమైనా పెద్దరికం అనిపించుకుంటుందా..? ఇప్పుడు జరుగుతున్నా వాటి గురించి మాట్లాడే ధైర్యం లేక పాత విషయాలు చెప్పుకుంటూ తప్పించుకోవాలని చూస్తున్నారు.. ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం అంటూ జగన్ మాట్లాడటం జరిగింది..