ముగ్గురు ఎంపీలకు చంద్రబాబు ఇచ్చిన టార్గెట్ ఇదేనా

Tuesday, July 23rd, 2019, 05:52:58 PM IST

గత ఎనికల ఓటమి తర్వాత తీవ్ర స్థాయిలో మథనం జరిపిన టీడీపీ ఓటమికి గల కారణాలను కనుగొంది. వాటిలో ప్రధానంగా పార్టీని నిర్లక్ష్యం చేయడం, కార్యకర్తల్లో సమన్వయం లోపించడం, దిశా నిర్దేశం చేసే ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయని తెలుసుకుంది. అందుకే అధ్యక్షుడు చంద్రబాబు ఈ లోపాల్ని సవరించే పనిలో పడ్డారు.

పార్టీని బలోపేతం చేసే భాద్యతను గెలిచిన ముగ్గురు ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్ మీద పెట్టారు. గుంటూరులోని రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కేడర్‌లో భరోసా నింపుతున్న బాబు పార్లమెంట్‌కు సెలవు సమయాల్లో రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎంపీలకు ఆదేశాలిచ్చారు. ఇది మాత్రమే కాకుండా కొత్త సభ్యుల్ని పార్టీలోకి పెద్ద ఎత్తున తీసుకురావాలని, హోదా విషయంలో అధికార పార్టీని గట్టిగా నిలదీయాలని తెలిపారట.