బిగ్ డిసీషన్: కోడెల కుమారుడికి కీలక పదవి.. షాక్‌లో వైసీపీ..!

Friday, September 20th, 2019, 05:05:26 PM IST

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం వరుస కేసులతో కోడెలను బాగా టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే ఈ కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కోడెలను చిత్ర హింస పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసారని టీడీపీ పెద్ద ఎత్తున వైసీపీపై ఆరోపణలు చేస్తూ వచ్చింది.

అయితే టీడీపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వైసీపీ చంద్రబాబు పార్టీలో పట్టించుకోకపోవడం వలనే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని, అందుకే బీజేపీలో వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారని విమర్శలు చేస్తున్నారు. అయితే వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో కోడెల తనయుడు డాక్టర్ కోడెల శివరాంకు ప్రాధాన్యత ఇవ్వాలని అందులోనే భాగంగా సత్తెనపల్లి టీడీపీ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కోడెల శివరాంను ప్రకటించాలని డిసైడ్ అయ్యారట. అయితే సత్తెనపల్లి పార్టీ ఇన్‌ఛార్జ్‌గానే కాకుండా, పార్టీలో ఏదైనా కీలక పదవిని అప్పగించాలని అలా చేయడం వలన కోడెల కుటుంబానికి పార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అందరికి అర్ధమవుతుందని, అప్పుడే కోడెల ఆత్మకు శాంతి చేకూరినట్టు అవుతుందని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.