జగన్ ఏడాది పాలనపై ట్రైలర్ వీడియో రిలీజ్ చేసిన చంద్రబాబు..!

Saturday, May 30th, 2020, 02:37:01 AM IST

ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ వైపు మన పాలన మీ సూచన పేరుతో టీడీపీ హయాంలో పాలనకు, జగన్ హయాంలో పాలనను పోలుస్తూ పలు ప్రకటనలు జారీ చేస్తోంది.

అయితే ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ఏడాది పాలనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియో ఇది. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో..! హతవిధీ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.