నాడు గుడ్‌లక్ చెప్పిన చంద్రబాబుకు బ్యాడ్‌లక్ మిగిల్చిన వైసీపీ ఎమ్మెల్యే..!

Wednesday, June 12th, 2019, 11:41:56 AM IST

విధి అన్ని సార్లు ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది అని అంటారు. అది నిజమే అని చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు చక్కటి ఉదాహరణలు. అయితే చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ముఖ్యమంత్రి అవుతాడు అని ఎవరూ ఊహించి ఉండరు. అయితే అనుకోని పరిణామాలు జరగడం టీడీపీ పార్టీ నందమూరి నుంచి నారా చేతుల్లోకి వెళ్ళిపోవడం చంద్రబాబు ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగిపోయింది.

అప్పటి నుంచి ఎదురు లేని నాయకుడిగా పాలనను అందిస్తూ, తన రాజకీయ జీవితాన్ని మరింత బలపరుచుకున్నాడు చంద్రబాబు. అయితే 2004లో,2009 లో కాంగ్రెస్ చేతుల్లో టీడీపీ ఓడిపోయినా ప్రతిపక్ష నాయకుడిగా, టీడీపీ పార్టీనీ నిలబెట్టుకుంటూ ముందుకు సాగాడు. అయితే 2014లో జరిగిన ఎన్నికలలో తిరిగి మళ్ళీ అధికారాన్ని చేపట్టారు. అయితే చంద్రబాబుకు విధి కాస్త సానుకూలంగా ఉన్నా అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం మునుపెన్నడూ లేని విధంగా పెద్ద ఎదురుదెబ్బ తిన్నాడు చంద్రబాబు. ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ చేతుల్లో ఘోర ఓటమి పాలయ్యాడు. అయితే ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పదో తరగతిలో స్టేట్ ర్యాంకర్ అబ్బాయిని సన్మానించాడు. మంచిగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలంటూ దీవించాడు. అయితే చంద్రబాబు దీవెనలు ఫలించాయో లేక చంద్రబాబుకు బ్యాడ్ లక్ అని చెప్పాలో తెలియదు. ఆ అబ్బాయి బాగా చదివి డాక్టర్ కూడా అయ్యాడు. ఆ అబ్బాయి ఎవరో కాదు వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు. అయితే అతను అంతటితో ఆగకుండా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ఈ సారి వైసీపీ నుంచి పలాసలో పోటీ చేసి చంద్రబాబు నిలబెట్టిన టీడీపీ అభ్యర్థిని మట్టి కరిపించారు. ఇది తెలిసిన చంద్రబాబు విధి అంటే ఇలానే ఉంటుందని అనుకుని ఉంటాడు. తాను ఆశీర్వదించిన పిల్లవాడు తనకే ప్రత్యర్ధిలా మారుతాడని అసలు కళలో కూడా ఊహించి ఉండడు చంద్రబాబు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో మీ దీవెనలు ఫలించాయి బాబు గారు అంటూ తెగ కామెంట్‌లు వస్తున్నాయట.