వైసీపీ తప్పులకు ఆ ముగ్గురు కోర్టు లో నిలబడాల్సి వచ్చింది – చంద్రబాబు

Thursday, June 4th, 2020, 08:21:52 AM IST

అధికార పార్టీ వైసీపీ పై, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సుప్రీం కోర్టు సైతం ప్రభుత్వం కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో ముగించక పోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే ప్రభుత్వం కార్యాలయాలకు వేసిన పార్టీ రంగులకు అయిన ఖర్చును వైసీపీ నుండి రాబట్టాలని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.అంతేకాక పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంతగా కీడు చేస్తుంది అనడానికి ప్రస్తుతం ఈ రంగుల ఉదంతమే నిదర్శనం అని ఘాటు విమర్శలు చేశారు.అయితే ప్రభుత్వ తీరు పై పలు మార్లు హైకోర్టు సైతం అగ్రహ్ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కరణ, అహంభావం, మూర్ఖత్వానికి ఇది ఉదాహరణ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తాము ఎది చేసిన ఒప్పు అనే అహంభావం ఉంది అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం వందకి పైగా తప్పులు చేసింది అని చంద్రబాబు ఆరోపించారు.అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇంకా అమలు కాలేదు కాబట్టే, కోర్టు ధిక్కరణ గా తీసుకొని, సి ఎస్, సెక్రటరీ,కమిషనర్ హజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.వైసీపీ తప్పులకు వారు కోర్టు లో నిలబడాల్సి వచ్చింది అని, ఇంత జరిగినా మళ్లీ సుప్రీం కోర్టు కి వెళ్తున్నారు అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.