3 గంటల్లో బెడ్ ఎక్కడైనా ఇస్తున్నారా?…సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ కామెంట్స్!

Wednesday, April 28th, 2021, 02:42:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల పై, సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా కట్టడి చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని వ్యాఖ్యానించారు. ఏపీ లో కరోనా వైరస్ పాజిటివిటీ రేటు 25.9 శాతానికి పెరిగింది అని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత చర్యలతో ప్రజలు చనిపోతున్నారు అని, కోర్టుకి కూడా ఈ మహమ్మారి విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక ఆరోగ్య శ్రీ లో కరోనా వైరస్ ను చేర్చామనీ చెబుతున్నారు అని, అది అంతా అబద్ధం అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ జీవో లు ఎక్కడా కూడా అమలు కావడం లేదని అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే అందరినీ కలుపుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని, ప్రజల ప్రాణాలు హరించి స్మశనాలకు రాజులు గా ఉండాలని అంటుకుంటున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే మిగతా అన్ని రాష్ట్రాల కంటే ముందే ఏపీ లో మద్యం దుకాణాలు, ధియేటర్లు, రెస్టారెంట్లు సహా అన్ని తెరిచారు అని ధ్వజమెత్తారు. అయితే మృత దేహాలను మోటార్ సైకిల్ పై తీసుకు వెళ్లాల్సిన దుస్తితి రాష్ట్రంలో నెలకొంది అంటూ అవేదన వ్యక్తం చేశారు. అయితే సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల సెటైర్స్ వేశారు చంద్రబాబు. ఎక్కడైనా రాష్ట్రంలో మూడు గంటల్లో బెడ్ కేటాయిస్తాం అని ప్రకటించారు, అయితే ఎక్కడైనా ఇస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. వెంటిలేటర్ బెడ్ కి 10 వేల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటే, లక్షల్లో వసూలు చేస్తున్నారు అని మండిపడ్డారు. అంతేకాక సీఎం జగన్ పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకి పరీక్షల నిర్వహిస్తామని చేసిన ప్రకటన పై సైతం చంద్రబాబు విమర్శలు చేశారు.