జగన్‌ తన కేసుల కోసం ప్రత్యేక హోదా తాకట్టుపెట్టాడు – చంద్రబాబు

Thursday, April 15th, 2021, 02:03:35 AM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా నేడు సత్యవేడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ కక్ష్యపూరిత రాజకీయాలు చేస్తుందని, దుర్మార్గుల చేతిలో రాష్ట్రం నాశనమవుతోందని అన్నారు. సీఎం పదవి తనకు కొత్త కాదని, పదవుల కోసం విలువలు లేని రాజకీయాలు తాను ఏనాడు చేయలేని చంద్రబాబు అన్నారుర్. ఓ పక్క రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.

అయితే కరోనా ఉధృతంగా ఉన్నప్పుడు మద్యం షాపులు తెరిచారని, సొంత బ్రాండ్‌ మద్యం తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, చదువు చెప్పే టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టాడని అన్నారు. జగన్‌ తన కేసుల కోసం ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదని, 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఏపీ ప్రజలను మోసం చేశాడని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే జైలుకెళ్తాడని జగన్‌‌కు భయమని అందుకే దాని గురుంచి నోరెత్తడం లేదని అన్నారు.