టీడీపీ నేతపై వైసీపీ నేతల దాడిని ఖండించిన చంద్రబాబు..!

Tuesday, July 14th, 2020, 09:38:33 AM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఆర్‌సి పురం మండలం పూజగారి పల్లె సర్పంచ్‌గా పనిచేసిన సుబ్రమణ్యంపై ఈ నెల 12 వ తేదిన వైసీపీ నేతలు దాడి చేశారు.

అయితే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టేందుకు వెళ్తే పోలీసులు తిరిగి ఆయనపైనే కేసు పెట్టారు. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై మండిపడ్డారు. తప్పు చేసినవాళ్లపై చర్యలు తీసుకోకుండా బాధితులపైనే కేసులు బనాయించడం దుర్మార్గమని అన్నారు. సుబ్రమణ్యంకు ఫోన్ చేసిన చంద్రబాబు ఆయనకు టీడీపీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.