తమాషాగా ఉందా..? నన్నే అవమానిస్తారా..? నీ వయసెంతో గుర్తుపెట్టుకో…? విరుచుకుపడిన చంద్రబాబు

Thursday, July 11th, 2019, 11:19:57 AM IST

ఆంధ్ర అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై వాడివేడి చర్చలు నడుస్తున్నాయి. గోదావరి జలాలు విషయంలో జగన్ మరియు చంద్రబాబు మధ్య పెద్ద స్థాయిలోనే చర్చలు నడుస్తున్నాయి. దీనిపై జగన్ మాట్లాడుతూ బాబు సీఎం గా ఉన్నప్పుడే కాళేశ్వరం కట్టారు, ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచారు. కనీసం అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారు, అసలు గోదావరి జలాలు ఎక్కడ నుండి వస్తాయో కూడా తెలియదు. మీకు క్లాస్ తీసుకోవాలి అంటూ గోదావరి నది పాయల గురించి జగన్ చెప్పుతూ, కనీసం ఇలాంటివి కూడా తెలియని వాళ్ళు గోదావరి గురించి చర్చ చేస్తున్నారనట్లు జగన్ మాట్లాడాడు.

దీనిపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నా అనుభవం అంత వయస్సు లేదు నీ వయస్సు, అధికారం చేతిలో ఉందని విర్రవీగిపోవద్దు. నేను రాష్ట్రము గురించి ఏమి మాట్లాడిన మీకు తమాషాగానే ఉంటుంది. నన్నే అవమానిస్తారా..? నన్ను ఎన్నెన్నో మాటలు అంటున్నారు, నాకేమి బాధ లేదు. కానీ 5 కోట్ల మంది భవిష్యత్తుని ఎలా తీసుకోని వెళ్లి తెలంగాణ చేతిలో పెడుతారు. ఇప్పుడు అక్కడ ప్రాజెక్టు లు కడితే రేపు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి, పోలవరం కడితే ఈజీ గ్రావిటీతో మనం నీళ్లు తెచ్చుకోవచ్చు. ఇవేమి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఊరుకునేది లేదంటూ తీవ్ర స్వరంతో బాబు మాట్లాడాడు.