వైసీపీదీ నిజంగా క్రిమినల్ మెంటాలిటీ.. చంద్రబాబు సంచలనం..!

Tuesday, September 17th, 2019, 08:04:44 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద నెలలే అయినా టీడీపీ శ్రేణులు అప్పుడే వైసీపీపై మాటల యుద్ధం మొదలు పెట్టారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైసీపీనీ ఇరుకున పెట్టే ఆరోపణలు చేస్తూ జగన్‌కి తాము అందించిన పాలనను గుర్తుచేస్తున్నాడు. అయితే చంద్రబాబు తాజాగా వైసీపీపై మరోసారి సంచలన ఆరోపణలు చేసారు. ఏమిటీ కుంచిత మనస్తత్వం? కోడెల మరణంతో ప్రభుత్వ వేధింపులు ప్రజల దృష్టికి వెళ్ళేటప్పటికి కొడుకే కోడెలను హత్య చేసారని కేసు పెట్టించారు. అతను విదేశాలలో ఉండబట్టి సరిపోయింది కానీ లేదంటే అన్యాయంగా అతని మీద హత్యా నేరం మోపేవాళ్ళు కదా అంటూ ఏంటీ క్రిమినల్ మెంటాలిటీ అని మండిపడ్డారు. అంతేకాదు తెదేపా పథకాలను రద్దు చేసారు. మేము చేపట్టిన ప్రాజెక్టులను ఆపేసారు. మా పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మా ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా నాలుగు నెలలుగా పక్కన పెట్టింది, వాళ్ళు చేసిన తప్పేంటో వైసీపీ ప్రభుత్వం చెప్పాలంటూ డిమాండ్ చేసారు.