ప్లాష్ ప్లాష్: టీడీపీ ఓటమిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

Friday, June 14th, 2019, 10:09:17 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు ఇచ్చిన హమీలన్ని ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యరు.

అయితే ఈ ఎన్నికలలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ విజయం తప్పకుండా తమేదేనని గట్టి నమ్మకంతో ఉన్నా సీన్ మాత్రం రివర్స్ అయ్యిందనే చెప్పుకోవాలి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానలను వైసీపీ గెలుచుకోగా టీడీపీ కేవలం 23 స్థానాలతో మునుపెన్నడూ లేని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఇంతకు ముందే ఓటమిపై సమీక్షలు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరోసారి ఓటమికి గల కారణాలను అన్వేశించే పనిలో పడ్డారు. తాజాగా టీడీపీ నేతలతో వర్క్ షాప్ నిర్వహించిన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికలలో గెలుపొందినా, ఓటమిపాలైనా అందుకు గల కారణాలు స్పష్టంగా కనిపించేవని ఈ ఎన్నికలలో మాత్రం అవి కనిపించడం లేదని వాపోయారట. నూతన రాష్ట్రం ఏర్పడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కూడా ప్రజలకు సంక్షేమ ఫలాలు మెండుగా అందించాం. అయినా కూడా ఎప్పుడు లేని విధంగా ఓటమి పాలవ్వడంపై పూర్తి స్థాయి సమీక్షలు జరపాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారట. ఈ సారి ఎన్నికలలో ఓటమి పాలైనా కూడా గతంలో కంటే ఈ సారి టీడీపీకి ఓటింగ్ శాతం పెరిగిందని నియోజకవర్గ స్థాయిలో ఓటమికి కారణాలు తెలుసుకోవాలని పార్టీ నేతలకు సలహాలు ఇచ్చాడట. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని కార్యకర్తలకు అండగా ప్రతి నాయకుడు నిలబడాలని కూడా చెప్పాడట.