ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో పెన్షన్ల విషయంపై మాట్లాడుతూ వైసీపీ వచ్చాక పెన్షన్లను భారీగా తొలగించిందని ఆరోపించారు. ఫించన్ల విషయంలో అధికార పక్షం తప్పుడు లెక్కలు చెబుతుందని, ఫేక్ మీడియాను పెట్టుకుని వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
అయితే టీడీపీ హయాంలో రూ.200 పెన్షన్ను రూ.1000కి పెంచినట్లు తెలిపారు. టీడీపీ హయాంలో 44.32 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చినట్లు ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేస్తుందని తమ హయాంలో 50.29 లక్షల మందికి పెన్షన్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీని వైసీపీ నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని, వాస్తవాలు మాట్లాడితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు. వాలు చెబితే అచ్చెన్నాయుడిపై 10 మంది ఎదురుదాడి చేశారని వివరించారు. టీడీపీ నేతలు అసెంబ్లీకి రాకూడదని వైసీపీ నేతలు అంటున్నారని అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా అని ప్రశ్నించారు.