బాబు మాస్టర్ ప్లాన్ కి అడ్డంగా బుక్కైన జగన్

Wednesday, July 17th, 2019, 11:06:32 AM IST

రాజకీయంగా ఎత్తులు వేయటంలో చంద్రబాబుని మించిన మరొకరు తెలుగు రాష్ట్రాల్లో లేరని చెప్పవచ్చు. కొన్ని సార్లు ఆయన ఎత్తులకు ఆయనే చిత్తైన సందర్భాలు ఉన్నకాని, ఎక్కువ సార్లు ఆయనే గెలిచినట్లు ఆధారాలు మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రతిపక్షములో ఉన్నప్పుడు,అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయటంలో ఆయన దిట్ట. ఆయన వేసే వలలో తమకి తెలియకుండానే అధికారపక్ష నేతలు చిక్కుకొని గిలగిలలాడటం గతంలోనే మనం గమనించాం.

తాజాగా జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని రంగరించి జగన్ ప్రభుత్వాన్ని ఇరుగున పెడుతున్నాడు. అసెంబ్లీ లో టీడీపీకి ఉంది 23 మంది. ఆ లెక్కన చూస్తే టీడీపీ వాయిస్ పెద్దగా వినిపించే ఛాన్స్ లేదు. అందులోను టీడీపీ నుండి ముగ్గురు మాత్రమే గట్టిగా మాట్లాడే నాయకులు కనిపిస్తున్నారు. అయినా సరే 150 మంది ఉన్న వైసీపీకి టీడీపీ పోటీ ఇస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అనుభవమే. వైసీపీకి అధికారం మొదటిసారి కావటం, శాసనసభలో సరైన అనుభవం లేకపోవటంతో బాబు ఉచ్చులో దాదాపుగా చిక్కుకుంది.

అసెంబ్లీలో వైసీపీ వాళ్ళకి కోపం తెప్పించి, వాళ్ళు టీడీపీ మీద ఎదురుదాడి చేసేలా, అధికార మత్తులో మాటలు తులేలా చేయటమే టీడీపీ ప్రధాన లక్ష్యం. తర్వాత వాటిని మీడియాలో హైలైట్ చేయటం వలన, వైసీపీ వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం జనాల్లో కలిగేలా చేయటం. అందుకు తగ్గట్లు వైసీపీ వాళ్ళు సహనం కోల్పోయి విమర్శలు చేస్తున్నారు . చివరికి సీఎం జగన్ కూడా అనేక సందర్భాల్లో మాటలు జారటం మనం గమనించవచ్చు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు పదేళ్ల అనుభవం సరిపోవటం లేదనేది వాస్తవం.