మీ అందరి క్షేమమే మీరు నాకిచ్చే జన్మదిన కానుక.. కార్యకర్తలకు చంద్రబాబు సజేషన్..!

Monday, April 19th, 2021, 06:30:11 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు రేపు కావడంతో కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉందని ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని కోరారు. నా పుట్టినరోజుకు ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి మీరంతా చేపట్టే కార్యక్రమాలు అభినందనీయమని, అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు కరోనా నుంచి రక్షణ పొందడం చాలా అవసరం అని అన్నారు.

అయితే నా పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని తెలుగుదేశం పార్టీ నేతలను, కార్యకర్తలను కోరుతున్నాను. దయచేసి మీరంతా ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండండి. మీ అందరి క్షేమమే మీరు నాకిచ్చే జన్మదిన కానుక అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.