ఆ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన చంద్రబాబు..!

Sunday, August 11th, 2019, 06:33:58 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయినా టీడీపీ శ్రేణులు అప్పుడే వైసీపీపై మాటల యుద్ధం మొదలు పెట్టారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైసీపీనీ ఇరుకున పెట్టే ఆరోపణలు చేస్తూ జగన్‌కి తాము అందించిన పాలనను గుర్తుచేస్తున్నాడు. అయితే చంద్రబాబు తాజాగా వైసీపీపై మరోసారి సంచలన ఆరోపణలు చేసారు. నెల్లూరుజిల్లా వెంకటేశ్వరపురం, జనార్ధనరెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ తెదేపా కార్యకర్తల ఇళ్ళు కూలుస్తున్నారు. కేవలం వైకాపాకి ఓటు వేయలేదన్న కారణంతో తెదేపా సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకోవడం గర్హనీయం అంటూ ఇకనైనా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఆపాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని ఘాటుగా చెప్పాడు.