బాబు ఒట్టు గ‌ట్టు మీద పెట్టాడా?

Wednesday, September 28th, 2016, 12:35:21 PM IST

babu
రాష్ర్టంలో ఇంకా అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మ‌హ‌త్య‌లు కొన‌సాగూత‌నే ఉన్నాయి. కేసు ద‌ర్యాప్తు జ‌రుగుతోన్న ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌డం లేదు. బాధుతుల‌కు ఎప్పుడు న్యాయం జ‌రుగుతుంద‌న్నదానిపై గ్యారెంటీ ఇవ్వ‌డం లేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సెప్టెంబ‌ర్ లోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం క‌నుగొని ఎవ‌రి డ‌బ్బు వారికి చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ నేటితో ఆ హామీకి ఏడాది పూర్త‌వుతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌రికి కూడా న్యాయం జ‌ర‌గ‌లేదు.

అగ్రిగోల్డ్ లో మొత్తం 11 వేల కోట్ల కుంభ కోణం జ‌రిగింద‌ని..కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఇద్ద‌ర్ని మాత్ర‌మే అదుపులోకి తీసుకున్నార‌ని నిన్న జ‌రిగిన నెల్లూరు స‌మావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. ఈ స్కామ్ లో మ‌రో ఎనిమిది మంది దోపిడిదారులున్నారు. వాళ్ల‌ను కూడా అదుపులోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. 20ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు కావాలో? ఆ దోపిడి దారులు కావాలో బాబు నిర్ణ‌యించుకోవాల్సిన స‌మ‌య‌మిద‌ని హెచ్చరించారు. త్వ‌ర‌లో మ‌రోసారి బాధితులంతా క‌లిసి రొడ్డెక్కక ముందే అంద‌రికీ న్యాయం చేస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments