ఫోక‌స్‌: ఎత్తు పై ఎత్తు.. తేదేపా వ‌ర్సెస్ వైకాపా..!!

Friday, December 30th, 2016, 08:18:54 PM IST

jagan-babu
ఎత్తుకు పైఎత్తు వేయ‌డంలో చంద్ర‌బాబు- జ‌గ‌న్ ఎవ‌రూ ఎవ‌రికీ తీసిపోరు. అయితే ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌గ‌న్ కంటే ఓ ఆకు ఎక్కువే తిన్నారు.. అన్న‌చందంగా ఉంది ఇటీవ‌లి ప‌రిణామాలు చూస్తే. ఓ చోట త‌మవారిని వైయ‌స్ జ‌గ‌న్ లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తే, వేరొక‌చోటి నుంచి బాబు న‌రుక్కొస్తున్నారు. ఆ కోవ‌లోనే ఇటీవ‌లి కాలంలో కొంద‌రు వైకాపాలో చేరితే, మ‌రికొంద‌రు తేదేపాలో చేరిపోయారు.

గుంటూరు – ప‌ల్నాడు సెంట‌ర్ స్పాట్‌ నరసరావుపేటలో జ‌గ‌న్ వ్యూహం పారింద‌ని తేల‌గానే… కౌంట‌ర్ ఎటాక్‌గా బాబు .. కృష్ణా జిల్లా పామర్రులో ప్ర‌తివ్యూహం అమ‌లు చేశారు. పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న తేదేపాలో చేరిక వెన‌క బాబు ప్ర‌తి వ్యూహ‌మే కార‌ణం. క‌ల్ప‌న‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు తేదేపాలో చేరిపోయి జ‌గ‌న్‌కి షాకివ్వ‌డంతో, అందుకు ప్ర‌తిగా జ‌గ‌న్ మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌ని, కాసు మ‌హేష్‌రెడ్డిని తేదేపా నుంచి త‌న పార్టీలోకి లాక్కున్నారు. ఈ దెబ్బ‌కు టీడీపీకి దిమ్మ తిరిగిపోయింది. ఇలా ఒక‌రిపై ఒక‌రు ఎత్తు-పైఎత్తుల‌తో చెల‌రేగిపోవ‌డం ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో చ‌ర్చ‌కొచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments