ముఖ్యమంత్రి చంపమంటే చంపేస్తారా…? ఆగ్రహించిన చంద్రబాబు

Wednesday, September 11th, 2019, 01:00:16 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాగా వైసీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలపై జరుపుతున్నటువంటి దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం నాడు “చలో ఆత్మకూరు” కార్యక్రమానికి నంది పలికారు. కాగా ఈ కార్యక్రమం పై వ్యతిరేకసీటునటువంటి కొందరు వైసీపీ నేతలు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తో పాటు టీడీపీ నేతలందరూ కూడా చేసినటువంటి అవినీతిని కూడా బయటపెట్టేందుకు వారు పల్నాడుకు బయల్దేరిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈమేరకు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వంపై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు.

కాగా వైసీపీ నేతలు జరుపుతున్నటువంటి దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు అసలే పట్టించుకోవడం లేదని, అసలు వారు ప్రజా సేవకుల లేక ప్రభుత్వాధికారులకు తొత్తులా అని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా వారిపై ఆగ్రహించిన చంద్రబాబు, ఒకవేళ మీ ముఖ్యమంత్రి చంపమంటే మమ్మల్ని చంపేస్తారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలకోసం కూడా ఆలోచించమని చంద్రబాబు వారికీ హితవు పలికారు.