సీఎం జగన్ కి ఆ పిచ్చి ఉంది – చంద్రబాబు సంచలన వాఖ్యలు

Friday, November 15th, 2019, 03:00:09 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు దీక్ష చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. కాగా విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి నిరాహార దీక్ష ముగింపు సభలో భాగంగా మాట్లాడిన చంద్రబాబు సీఎం జగన్ పై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ కి డబ్బుల పిచ్చి అని, డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తాడని, అంతేకాకుండా తనకు కావాల్సిన డబ్బులకోసం రాష్ట్రంలోని ప్రజల ఆస్తులను బలవంతంగా ఆయన రాయించుకొని లాక్కున్నప్పటికీ కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చంద్రబాబు విమర్శించారు.

ఇకపోతే రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా సీఎం జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారని, ప్రతి ఒక్కరు కూడా సీఎం జగన్ తమ రక్తాన్ని తాగుతున్నాడని, ప్రతిఒక్కరు ఆరోపిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు, గతంలో కూడా ఇలాంటి తప్పుడు లెక్కలు చూపి అవినీతికి పాల్పడినట్లు, ఇప్పుడు కూడా అలాగే ప్రయత్నాలు చేస్తున్నారని, డబ్బు పిచ్చిలో పడి రాష్ట్ర ప్రజలందరితో సత్సంబందాలని కూల్చేసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.