వైసీపీ నేతలు మరీ ఇంతలా దిగాజారి పోయారా…?

Sunday, September 22nd, 2019, 05:50:27 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ పైన, వైసీపీ నేతలపైనా కూడా చాలా తీవ్రగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి గర్మ వాలంటీర్లు మరియు గ్రామా సచివాలయ ఉద్యోగాల్లో చాలా అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు నుండే విమర్శిస్తున్నారు. కాగా తాజాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా ఆ ఉద్యోగాలన్నీ కూడా తమ వాళ్ళకే ఇచ్చుకున్నామని ప్రత్యక్షంగా ప్రకటించుకుంటున్నారు. కాగా ఆ వీడియో ని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ప్రజలందరికి కూడా తెలిసేలా పోస్టు చేశారు. అంతేకాకుండా దానికి అనుగుణంగా చంద్రబాబు వైసీపీ నేతలపై సంచలన వాఖ్యలు చేస్తున్నారు.

“ప్రజల ఓట్లతో గెలిచి ఆ ప్రజలకే ద్రోహం చేస్తూ, కేవలం వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకున్నామని.. తమ అవినీతిని ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారో చూడండి. ” టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇలా ప్రజలందరిముందు తమ అవినీతిని బహిరంగంగా ప్రకటించిన వారిని వదిలేసి ప్రభుత్వ అవినీతిని ప్రశిస్తున్న తన టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం చాలా దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.