బాధిత కుటుంబాలకు అండగా చంద్రబాబు సంచలన నిర్ణయం…

Friday, June 14th, 2019, 09:27:33 PM IST

నేడు జరిగినటువంటి టీడీపీ పార్టీ సమావేశాల్లో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు కొన్ని సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు… ఇటీవల వైసీపీ నేతలు మరియు కార్యకర్తల చేయిలో దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న టీడీపీ పార్టీ ప్రస్తుతానికి రాష్ట్రము లో తన బలం పెంచుకునే దిశగా భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకుంటుంది. అందులో భాగంగా టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల్ని ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు, వారికి అండగా ఉండేందుకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. వైసీపీ దాడుల్లో మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచేందుకు, దాడుల్లో మరణించిన ఒక్కో కార్యకర్త కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు చంద్రబాబునాయుడు. కాగా దీనికి సంబందించిన నిర్ణయాన్ని ఈరోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ సమావేశంలో చంద్రబాబు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా కార్యకర్తలపై దాడులను నివారించడం, దౌర్జన్యాలను ఎదుర్కోవడమే తెదేపా తక్షణ కర్తవ్యంగా భావిస్తోంది. ఎక్కడ దాడులు జరిగినా తక్షణమే స్థానిక నాయకత్వం స్పందించాలి. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వారిలో భరోసా పెంచాలి. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ బలాన్ని పటిష్టం చేసే దిశగా నేతలందరికీ చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు…