ఇంకా చాలా మంది పులులు ఉన్నారు మా దగ్గర – చంద్రబాబు నాయుడు

Tuesday, November 19th, 2019, 03:00:29 AM IST

ప్రస్తుతానికి ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలు కొనసాగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా నేడు పశ్చిమ గోదావరి జిల్లా లో పర్యటించిన చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వల్లభనేని వంశీ నిష్క్రమణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా అసెంబ్లీలో తమ పార్టీ నేతలు ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని వైసీపీ వారు తట్టుకోలేకపోతున్నారని, అందుకనే ఇలా తమనేతలను వారి పార్టీలోకి లాక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కాగా తన పార్టీలో ఇప్పటివరకు కూడా 23 మంది పులులు ఉన్నారని, కానీ ఒక్కరు వెళ్ళిపోతే పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని చంద్రబాబు వాఖ్యానించారు.

ఇకపోతే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కోసం మాట్లాడుతూ… తనని అనవసరంగా జైలుకు పంపించారని, కానీ తాను చేసిన తప్పు ఏమి లేదని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్ జైలుకు వెళ్లొచ్చిన కారణంగానే రాష్ట్రంలోని ఇతర నేతలను కూడా జైలుకు పంపించడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.