ఇక మీదట ఛాన్స్ తీసుకోను – చంద్రబాబు సంచలన వాఖ్యలు

Wednesday, June 12th, 2019, 12:19:05 AM IST

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైన వాఖ్యలు చేశారు. టీడీఎల్పీ సమావేశంలో భాగంగా ఎమ్మెల్సీలతో సమావేశమైన చంద్రబాబు కెలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం పై ఆరు నెలల పాటు విమర్శలు చేయొద్దని ముందుగా భావించినప్పటికీ కూడా ప్రస్తుతానికి పరిస్థితి అంత కూడా మారిపోయిందని, కార్యకర్తలపై దాడులు, ఆధిపత్య ధోరణి సహించకూడదని చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం మొదలయ్యాయన్న చంద్రబాబు, కార్యకర్తల్లో ధైర్యం నింపాలని నేతలకు చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సవ్యంగా మాట్లాడాలని సూచించారు. ప్రతి విషయం మీద తీవ్రంగా ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందులో వివిధ పదవులకు చంద్రబాబు సరైన నేతలను ఏర్పాటు చేశారు. శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుని నియమించారు. పార్టీ విప్‌గా బాల వీరాంజనేయ స్వామి ఎంపిక చేశారు. ఇక శాసనమండలి ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడును పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా డొక్కా, శ్రీనివాసులు, సంధ్యారాణిలకు ఛాన్స్ ఇచ్చింది. మండలిలో పార్టీ తరపున విప్‌గా బుద్దా వెంకన్నను నియమించింది.