బ్రేకింగ్ న్యూస్ : వైసీపీ అక్రమాలపై చంద్రబాబు దిమ్మ తిరిగే ట్వీట్.!

Tuesday, September 10th, 2019, 06:21:05 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కిస్తున్నాయి.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీ అభిమానులు మరియు కార్యకర్తల మీద విచ్చల విడిగా దౌర్జన్యాలు దాడులు ఎక్కువయ్యేపోయాయని మండిపడ్డారు.ఇప్పుడు అవన్నీ మితి మీరడంతో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి మరియు ఆ పార్టీ అధినేత చంద్రబాబే రంగంలోకి దిగారు.మారుతున్న సమీకరణాలు చూసి చలో ఆత్మకూరు అనే నినాదంతో తెలుగుదేశం అభిమానులకు పిలుపును కూడా ఇచ్చారు.

అయితే వైసీపీ కేవలం బయట మాత్రమే కాకుండా సోషల్ మీడియా విభాగంలో టీడీపీ అభిమానులను కూడా టార్గెట్ చేసింది అని వారు వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి పోస్ట్ పెట్టినా సరే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.ఇప్పుడు దీనికి సంబంధించే వైసీపీ అక్రమాలపై చంద్రబాబు కూడా ఒక సంచలన ట్వీట్ పెట్టి మరింత వేడి రాజేశారు.

“ఒక్క తెదేపా సోషల్ మీడియా కార్యకర్తల పైనే వేధింపులా? వాళ్లను బెదిరించే వైసీపీ వాళ్లపై చర్యలు ఉండవా? చట్టం వైసీపీకి గత 100 రోజుల్లో చుట్టం అయిందా? “151మేకలు, 23 పులులు” అని పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా? “నా భూమిని కబ్జా చేసారు ఇదేనా రాజన్న రాజ్యం” అని ప్రశ్నిస్తే కేసు పెడతారా?” అని వైసీపీపై సూటిగా దాడి చేస్తూ దిమ్మ తిరిగే ట్వీట్ వేశారు.మరి దీనిపై వైసీపీ ఎమన్నా వివరణ ఇస్తుందేమో చూడాలి.