మాటలు తప్ప చేతలు లేవు.. వైసీపీపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..!

Tuesday, August 20th, 2019, 09:07:31 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయినా టీడీపీ శ్రేణులు అప్పుడే వైసీపీపై మాటల యుద్ధం మొదలు పెట్టారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వైసీపీనీ ఇరుకున పెట్టే ఆరోపణలు చేస్తూ జగన్‌కి తాము అందించిన పాలనను గుర్తుచేస్తున్నాడు. అయితే కృష్ణానది వరద బాధితులను పరామర్శించేందుకు ఈ రోజు విజయవాడ కృష్ణలంకలోని గీతా నగర్, భూపేష్ గుప్తానగర్ ప్రాంతాలలో పర్యటించిన చంద్రబ్బు ఇళ్ళు మునిగిపోయి అవస్థలు పడుతున్నా అధికారులు, మంత్రులు ఎవరూ సాయం చేసేందుకు రాలేదని బాధితులు అన్నారు. ఎలా వస్తారు? మంత్రులంతా నా ఇంటిచుట్టూ తిరిగారు. వరద నివారించే అవకాశం ఉన్నప్పటికీ, నీళ్లు కావాలని నిలబెట్టి, నా ఇంటిని ముంచే ప్రయత్నంలో ప్రజల ఇళ్ళను ముంచింది ప్రభుత్వం. ఇది అన్యాయం. మా హయాంలో కొంతవరకు రిటైనింగ్ వాల్ కట్టడం మూలంగా దాదాపు 50 వేల మంది ముంపు నుంచి రక్షించబడ్డారు. వాల్ పూర్తయ్యే వరకు, టీడీపీ ప్రజలకు అండగా ఉంటుంది. ప్రభుత్వ మాటలు కోటలు దాటాయి, చేతలు గడప కూడా దాటలేదంటూ అన్నక్యాంటీన్లు ఉండి ఉంటే వరద బాధితుల ఆకలి తీర్చేవి. వాటినీ మూసేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలి. విజయవాడ ముంపుప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మించాలి. స్థానికులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేసారు.