బిగ్ బ్రేకింగ్ : టీడీపీ భవితవ్యం కోసం చంద్రబాబు సంచలన నిర్ణయం.!?

Wednesday, August 14th, 2019, 11:20:56 AM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీను మళ్ళీ పాత స్థితికి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకపక్క ప్రతిపక్ష హోదాలో ఉంటూనే మరో పక్క వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.ఇందులో భాగంగానే చంద్రబాబు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక వార్త వైరల్ అవుతుంది.పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు ఇప్పుడున్న సీనియర్ లీడర్లు అందరిని పక్కకు తప్పించి దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకు యువతకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

అందుకు సంబంధించిన అన్ని అంశాలను నిన్న జరిగినటువంటి విజయవాడ మీటింగులోనే చంద్రబాబు చర్చకు తీసుకొచ్చారని.రానున్న రోజుల్లో యువతను తీసుకుంటేనే తప్ప తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నిలకడగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.అయితే ఈసారి ఎన్నికల్లో కొంతమంది యువ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చినా వారు ఓటమి తర్వాత అసలు కనిపించలేదని కానీ ఇప్పుడు మాత్రం అలాంటి వారికి కాకుండా ఇతరులకు అవకాశం ఇచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.