బ్రేకింగ్ : టార్గెట్ మార్చిన చంద్రబాబు..సంచలన నిర్ణయం తీసుకోనున్నారా?

Saturday, June 1st, 2019, 06:03:41 PM IST

ఏపీ రాజకీయాల్లో అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.దీనితో ఇక ఆంధ్ర రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబు శకం ముగిసిపోయినట్టే అని అంతా అనుకున్నారు.కానీ చంద్రబాబు బుర్రలో వేరే ఏదో ప్లాన్ ఉందని రాజకీయ వర్గాల్లో ఒక అంశం హాట్ టాపిక్ అయ్యింది.చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయాలకు స్వస్తి చెప్పి గత ఎన్నికల్లోనే దెబ్బ తిన్న తెలంగాణా పై దృష్టి సారించనున్నట్టు తెలుస్తుంది.

ఆంద్ర రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా వదిలేసినట్టేనా అంటే దానికి సరైన సమాధానం దొరకడం లేదు కానీ తెలంగాణా రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు మరో సారి తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.దీనిపై ఇప్పటికే చంద్రబాబు అక్కడ పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారట.ఇప్పటికే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రమణకు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాలు నమోదు చెయ్యాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.వారంలో రెండు రోజులు తెలంగాణలోనే ఆందుబాటులో ఉంటానని వారు చంద్రబాబు వారికి తెలిపారట.మరి రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.