జగన్ గెలుపుపై చంద్రబాబు సంచలన నిర్ణయం.?

Sunday, June 2nd, 2019, 11:20:26 PM IST

నవ్యాంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విజయ బావుటా ఎగుర వేశారు.జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీలో నిలబడిన తెలుగుదేశం మరియు జనసేన ఈ రెండు పార్టీలకు ఏమాత్రం కూడా తావివ్వకుండా తన ప్రభావాన్ని గట్టిగా చూపించారు.దీనితో వైసీపీ చెంతకు 151 స్థానాలు వచ్చి పడ్డాయి.వీరికి ఇన్ని స్థానాలు వచ్చాయి అంటే అవతల తగ్గిపోయినట్టేగా దీనితో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది.

ఎన్నికల ముందు వరకు జగన్ మరియు ఇతర వైసీపీ శ్రేణులను తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ గెలుపు విషయంలో కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇటీవలే తమ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు అందరితో టీడీఎల్పీ మీటింగ్ జరిపిన సంగతి తెలిసిందే.ఈ మీటింగ్ లో చంద్రబాబు కొన్ని కీలక సలహాలు సూచనలు వారికి తెలియజేయడంతో పాటుగా సీనియర్ నేతల నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించున్న జగన్ పై తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ నేత కూడా ఎలాంటి విమర్శలు చెయ్యకూడదు అని బాబు తెలిపారట అలాగే జగన్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడే కాబట్టి అతని పనితనాన్ని ఇప్పుడే ఒక అంచనా వేసేయ్యకుండా ఒక ఆరు నెలల నుంచి ఒక ఏడాది సమయం అయినా ఇవ్వాలని అప్పటి వరకు జగన్ పై కానీ వైసీపీపై కానీ విమర్శలు చెయ్యకూడదు అని బాబు తెలిపినట్టు తెలుస్తుంది.అంతే కాకుండా ఈసారి టీవీ డిబేట్లకు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎవ్వరూ ఒక 6 నెలల పాటు హాజరు కాకుండా ఉంటేనే వారి పార్టీకి మంచిదని సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించారట.దీనితో ఒక సంవత్సరం వరకు సైలెంట్ గా ఉండి ఆ జగన్ పై తమ స్పందనను ఎలా తెలియజేస్తారో చూడాలి.