జగన్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం.?

Wednesday, June 12th, 2019, 12:11:27 PM IST

ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ధాటికి నిలవలేక ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే.వైసీపీ ఖాతాలో ఏకంగా 151 సీట్లు పడగా తెలుగుదేశం పార్టీకు మాత్రం కేవలం 23 స్థానాలు మాత్రమే దక్కడంతో ఇక రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని అంతా అనుకున్నారు.కానీ ఇదే సందర్భంలో రానున్న రోజుల్లో భవిష్యత్ రాజకీయాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇటీవలే తన పార్టీ శ్రేణులతో సమావేశం అయిన చంద్రబాబు రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఎండగట్టి తీరాలని ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల మీద చేసిన దాడులను తీవ్ర రూపం దాల్చే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ అంటే వ్యతిరేఖత తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పని చెయ్యాలని సూచించారట.శాసన సభలో తమ బలం తక్కువగా ఉన్నాసరే మండలిలో తమ బలం అధికమని అందువల్ల ఎవరు భయపడవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారట.మరి జగన్ విషయంలో బాబు వేసిన ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.