బిగ్ బ్రేకింగ్ : జగన్ దెబ్బకు చంద్రబాబు సంచలన నిర్ణయం..షాక్ లో వైసీపీ!

Wednesday, September 11th, 2019, 10:24:31 AM IST

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు షాకిచ్చిన సంగతి అందరికి తెలిసిందే.తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు ఎక్కువయ్యాయని వైసీపీపై తిరిగుబాటులా చలో ఆత్మకూరు అని చంద్రబాబు తెలుగుదేశం క్యాడర్ కు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు మొత్తం వేడెక్కాయి.

దీనితో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పెద్ద బెటాలియన్నే దింపవలసి వచ్చింది.దీనితో అక్కడకు తరలి వచ్చిన తెలుగుదేశం కీలక నేతలు అందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేసి షాకిచ్చారు.దీనితో ఇప్పుడు చంద్రబాబు మరింత ఆగ్రహానికి లోనయ్యి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా బయటకొచ్చిన వార్తలు మరింత వేడిని రాజేశాయి.

ఇలా తమ నిరసనను తెలియజేయడానికి వస్తున్న టీడీపీ నేతలను మరియు కార్యకర్తలను అరెస్ట్ చేస్తుండడంతో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగి నిరాహార దీక్ష చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ నిర్ణయంతో ఏపీ రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయో చూడాలి.