సోమ‌వారం వ‌స్తే బుర్ర తినేస్తాడు!

Wednesday, September 28th, 2016, 12:32:35 PM IST

babu-chandra-babu
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు 24/7 అలెర్టుగా ఉంటారు. అధికారుల‌తో బాగా ఇంట‌రాక్ట్ అవుతారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌తి విష‌యాన్ని పూస‌ గుచ్చిన‌ట్లు అడిగి మ‌రీ తెలుసుకుంటారు. లోపాలేవైనా ఉంటే వాటికి ప‌రిష్కారం చెబుతారు. వాళ్ల య‌వ్వారం తేడాగా ఉంటే తాట తీస్తారు కూడా. అయితే ఈ విధానంపై అధికారులు అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌తి సోమ‌వారం బాబు క‌చ్చితంగా వాళ్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ లో పాల్గొంటున్నారు. అధికారంలంద‌రితో గంట సేపు మాట్లాడుతున్నారు. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది.

మాట‌ల్లో మ‌మేకం అయిన త‌ర్వాత చెప్పాల్సిన విష‌యాన్ని ప‌ది నిమిషాల్లో పూర్తిచేసి చెప్పిన మాట‌ల‌నే ప‌దే ప‌దే చెబుతూ అధికారుల‌ను బాగా విసిగిస్తున్నార‌ట‌. నిజానికి ఈ కాన్ప‌రెన్స్ అనేది స‌మ‌యం, డ‌బ్బు వృద్దా నివారించ‌డ‌మే ముఖ్య ఉద్దేశం. కానీ బాబు దీనికి వ్య‌తిరేకంగా వెళుతూ బుర్ర తినేస్తున్నార‌ని అధికారుల ఫీలింగ్‌. విసిగిపోయిన అధికారుల ఒక్కో వారం డుమ్మా కొడితే వ‌చ్చే వారం కోటింగ్ ప‌డిపోవ‌డం బోన‌స్‌. దీంతో ఆ కాన్ఫ‌రెన్స్ పై మ‌న‌సు పెట్ట‌లేక… ఇటు సెల‌వు పెట్టుకోలేక ఇర‌కాటాన ప‌డుతున్నామ‌ని అధికారులంతా బాబుపై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇలా చేయ‌డం మంచిదేన‌ని ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అధికారులంద‌ర్నీ అలెర్ట్ చేయ‌డానికి ఇలాంటి స‌మావేశాలు బాగా దోహ‌ద‌ప‌డ‌తాయి. ప‌నిలో అల‌స‌త్వాన్ని త‌రిమేసేందుకు బాబు చేసే ఈ ప‌నిని శ‌త‌ధా స్వాగతిద్దాం.