పోల‌వ‌రంపై తేడాలొస్తే తాట తీస్తా: చ‌ంద్ర‌బాబు

Tuesday, September 27th, 2016, 11:55:07 AM IST

babu-chandra-babu
దివంగ‌త సీఏం వైఎస్సార్ చేప‌ట్టిన ప్ర‌తిష్టాత్మ‌క పోల‌వ‌రం ప్రాజెక్ట్ కు మ‌ళ్లీ జ‌వ‌స‌త్వాలొస్తున్నాయి. కేంద్రం ప్రోద్భ‌లంతో కొరిన‌న్ని నిధుల‌ను నాబార్డ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. నా బార్డు నుంచి దాదాపు 800 కోట్ల నిధులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లో మంచి రోజు చూసుకుని ప‌నులు పున ప్రారంభించ‌డమే ఆల‌స్యం. దీనిలో భాగంగా ఏపీ సీఏం చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

పోల‌వ‌రం లాంటి ప్రాజెక్ట్ ఇప్ప‌ట్లో ఎవ్వ‌రూ చేప‌ట్ట‌లేరు. ఆ గొప్ప అవ‌కాశం మ‌న‌కి కలిగింది. ఆ అవ‌కాశాన్ని వినియోగించుకుని అంద‌రూ నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయండి. పోల‌వ‌రం పూర్తిచేయ‌డానికి మ‌న ముందుంది కేవ‌లం 27 నెల‌లు మాత్ర‌మే. ఈ గ‌డులు లోపు ప్రాజెక్ట్ ను పూర్తిచేసి కేంద్రానికి అప్ప‌జెప్పాలి. అలా చేస్తే ప్ర‌జ‌లు మ‌న‌ల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. నాణ్య‌త‌, సాంకేతికత‌ ప‌రంగా రాజీ ప‌డ‌వ‌ద్దు. ప్రాజెక్ట్ కు అవ‌స‌ర‌మైన వాట‌న్నింటి తెప్పించుకోండి. నిర్మాణంలో ఒక్క త‌ప్ప‌ట‌డుగు ..అవినీతి జ‌ర‌గ‌డానికి వీలు లేదు. అలాంటి వేశాలు నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే ప‌ని శిక్ష సీరియ‌స్‌గా ఉంటుందని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. పోల‌వ‌రం పూర్త‌యితే ఆ ప్రాంత‌మంతా ప‌ర్యాట‌క ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు.