కోడెల విషయం లో ఫైనల్ డెసిషన్ తీసుకున్న చంద్రబాబు..

Wednesday, September 18th, 2019, 07:03:37 PM IST

టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య విషయం లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై చాల సీరియస్ గా వున్నారు. ఆరోపణలతో, అబద్దపు కేసులతో టీడీపీ నేతల్ని ఇబ్బందులకు వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని తేలిపారు. అయితే ఈ చర్యలకు అడ్దుకట్ట వేసేందుకు టీడీపీ నేతలు గురువారం గవర్నర్ ని కలవనున్నారు.

వైసీపీ ప్రభుత్వం తీరుతో టీడీపీ నేతలు ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ కి తెలియ జేయనున్నారు. కోడెల ఆత్మహత్య విషయాన్నీ కూలంకషం గా చర్చించి పూర్తీ దర్యాప్తు చేపట్టాలని గవర్నర్ ని కోరనున్నారు. ఈ కేసు ని సిబిఐ కి కూడా ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేయనున్నారు. కోడెల ఆత్మహత్య కి వైసీపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు అని చంద్రబాబు అన్నారు. కోడెలను వైసీపీ ప్రభుత్వం మానసికం గ, ఆర్థికంగా, శారీరకం గా ఇబ్బందులకు గురి చేసారని ఇది వరకే వెల్లడించారు.