మీడియాకు వెంకయ్య పాఠాలు

Saturday, September 27th, 2014, 12:18:16 PM IST


కేంద్ర పట్టనాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి శనివారం విజయవాడ దూరదర్శన్ సప్తగిరి చానెల్ ను ప్రారంభించారు. అనంతరం వెంకయ్య ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ టెలివిజన్ ప్రజా జీవనంలో పెనవేసుకుపోయిందని అభిప్రాయపడ్డారు. అలాగే టీవీ చానెళ్ళ మధ్య పోటీతత్వం పెరిగిందని, రేటింగ్ కోసం పోటీ పడడం మంచిది కాదని ఆయన సూచించారు.

కేంద్రమంత్రి వెంకయ్య ఇంకా మాట్లాడుతూ సత్యానికి దగ్గరగా, సంచలానికి దూరంగా మీడియా పనితీరు ఉండాలని ఆకాంక్షించారు. అలాగే వార్తలను వార్తలుగానే చెప్పాలని, వ్యాఖ్యానాలను వ్యాఖ్యానాలుగానే చూపించాలని ఆయన సూచించారు. ఇక పోటీ ప్రపంచంలో ఆలస్యానికి అర్ధం లేదని వెంకయ్య నాయుడు తెలిపారు. అలాగే దూరదర్శన్ కు 1417 ట్రాన్స్ మీటర్లు, 32 చానెళ్ళు ఉన్నాయని వెంకయ్య వివరించారు. ఇక కార్యక్రమంలో పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.