అరెస్టులు చేస్తే ధర్నాలు చేస్తాం – హెచ్చరించిన చంద్రబాబు

Wednesday, September 11th, 2019, 03:01:35 AM IST

బుధవారం నాడు టీడీపీ పార్టీ నేతలు చేపట్టినటువంటి ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమంపై, ముందురోజు అనగా మంగళవారం నాడు టీడీపీ నేతలందరితో చంద్రబాబు నాయుడు ఒక టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా ఈ కాన్ఫరెన్క్యూలో 13 జిల్లాలకు సంబందించిన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఇన్‌చార్జ్‌లు తో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. కాగా చావు ఆత్మకూరు కార్యక్రమం కోసం నిశితంగా వారు చర్చించినట్లు సమాచారం. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికి కూడా, ఏది ఏమైనా కూడా ఈ చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తప్పకుండ విజయవంతం చేయాలనీ చంద్రబాబు అందరిని ఆదేశించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ప్రజలకోసమని, ,వైసీపీ నేతల బాధితుల కోసమని చంద్రబాబు అందరికి వివరించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంబందించిన ప్రణాలికను మొత్తం వివరించారు చంద్రబాబు.

కాగా వైసీపీ నేతలు జరిపినటువంటి దాడులకు గురైన బాధితులకు అందరు కూడా సంఘీభావం తెలపాలని టీడీపీ కేడర్‌కు అధినేత చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వ అరాచకాలను అరికట్టాలంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ చంద్రబాబు తెలిపారు. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని గనక వైసీపీ నేతలు అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అక్కడే నిరసనలు చెప్పట్టాలని చంద్రబాబు తమ నేతలకు సూచించారు.