ముఖ్యనేతలతో భేటీ అయిన చంద్రబాబు – మళ్ళీ వేరే ప్లాన్ వేశారా…?

Wednesday, June 5th, 2019, 01:11:45 AM IST

ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారు… రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం అవడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలను చర్చించారు అని సమాచారం. అయితే ఈ నెల 7 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటకు వెళ్తున్నారు. కాగా ఈ సందర్భంలో రాష్ట్రంలో జరపాల్సిన పనులపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. కాగా ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని, నిదానంగా వ్యవహరించాలని, ఎలాంటి ఆందోళనలకు గురి కావొద్దని చంద్రబాబు సూచించారని సమాచారం… అంతేకాకుండా తెలంగాణకు ఏపీ భవనాలు అప్పగించడంపై టీడీపీ నేతలు చర్చించారు. ఏకపక్షంగా ఏపీ ఆస్తులు అప్పగించారని కొందరు నేతలు వ్యక్తం చేశారు. పాలనా వ్యవహారాలపై అప్పుడే విమర్శలు మంచిది కాదని మరికొందరు సూచించారు. అయితే ప్రస్తుత ప్రజావేదికను టీడీపీ ప్రతిపక్షనేత నివాసంగా కేటాయించాలని టీడీపీ కోరుతుందని సమాచారం. అంతేకాకుండా విజయవాడలో పార్టీ కార్యక్రమాలకు ఒక భవనం పరిశీలించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. జిల్లా కమిటీల స్థానంలో పార్లమెంటరీ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభలో టీడీపీ ఉపనేత, పార్టీ విప్‌గా కేశినేని నాని, రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా సీఎం రమేష్‌‌ను ఎన్నుకున్నారు