పవన్ కి మద్దతు ఇస్తున్న చంద్రబాబు – ఏమంటున్నారంటే…?

Friday, November 15th, 2019, 02:05:54 AM IST

ఆంధ్రప్రదేశ్ గత కొంత కాలంగా జరుగుతున్నటువంటి ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వానికి మరియు విపక్షాలకు అన్నింటికీ కూడా తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతుంది. కాగా ఈమేరకు ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి రాష్ట్రంలో ఇసుక రవాణా సక్రమంగా జరిపించి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఎదో ఒక రకమైన సహాయాన్ని చేయాలనే ఆశతో విపక్ష నేతలు దీక్షలు, ర్యాలీలు లాంటి చేపడుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్రంలోని ఇసుక రవాణా కోసమై ఒక్కరోజు దీక్ష చేపట్టారు కూడా.

అయితే ఈ మేరకు మాట్లాడిన చంద్రబాబు కొన్ని ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తనకు దత్త పుత్రుడు అంటున్నారని, పవన్, తానూ ఇద్డు కలిసి కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కాగా తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఈ పోరాటం చేయడం లేదని, భవిష్యత్‌ కోసం, పేదల కోసం పోరాటం సాగిస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపోతే ఇటీవల వైసీపీ నేతలు చేసిన విమర్శలపై స్పందించిన చంద్రబాబు…

‘మేం తలచుకుంటే మీకు లాగ వ్యక్తిగత విమర్శలు చేయగలం. కానీ ఎవరి వ్యక్తిగతం వారికే ఉంటుంది. ఎపుడు కూడా అలాగ తప్పుడు విమర్శలు చేయకూడదు అని, ఇకపోతే అన్ని కులాలు మనవే అని చంద్రబాబు వాఖ్యానించారు.