చంద్ర‌బాబూ.. అది అబ‌ద్ద‌మ‌ని తేలితే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటావా..?

Thursday, March 14th, 2019, 07:16:32 PM IST

ఎన్నిక‌ల దృష్ట్యా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై అబాండాలు వేస్తున్నార‌ని, ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా త‌న విజ‌యాలు, చేసిన అభివృద్ధిని చెప్పుకుని ఓట్లు అడుగుతారే త‌ప్ప.. చంద్ర‌బాబులా ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు చేయ‌ర‌ని వైసీపీ నేత పార్ధ‌సార‌ధి అన్నారు. పార్ధ‌సార‌ధి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం స్థానంలో ఉన్న చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయ‌లేదు కాబ‌ట్టే ప్ర‌తిప‌క్షంపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు.

వైఎస్ జ‌గ‌న్‌కు, హిందూజా భూముల‌కు ఎటువంటి సంబంధం లేద‌ని, అటువంటిది సంబంధం ఉందంటూ చంద్ర‌బాబు అవాస్త‌వాలను చెప్ప‌డం త‌గ‌ద‌న్నారు. నీవు చెప్పింది అబ‌ద్ద‌మ‌ని తేలితే రాజ‌కీయ సన్యాసానికి సిద్ధ‌మా..? అంటూ స‌వాల్ విసిరారు. అస‌లే జ‌గ‌న్‌పై అక్ర‌మ కేసుల‌ను బ‌నాయించారు.. ఆ క్ర‌మంలో ఈడీ, సీబీఐ మ‌ధ్య జ‌రిగిన వ్య‌వ‌హారాల ప‌త్రాలు మీకెలా అందాచి చంద్ర‌బాబూ అంటూ ప్ర‌శ్నించారు.
Attachments area