గవర్నర్ భిశ్వభూషణ్ కి చంద్రబాబు లేఖ…ఎందుకంటే?

Tuesday, June 8th, 2021, 04:02:52 PM IST


తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ భిశ్వభూషణ్ హరి చందన్ కి లేఖ రాశారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్నేహ పూర్వక పోలీసింగ్ అమలు అయ్యేలా చొరవ చూపాలి అని తెలిపారు. అయితే కరోనా వైరస్ వేళ ఫ్రంట్ లైన్ వారియర్స్, సామాన్య ప్రజలను అర్థం లేని వేధింపులకు గురి చేస్తున్న పోలీసులు మరియు అధికారుల పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం లో ఒక వర్గం పోలీసులు ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాక రాష్ట్రం లో పలు చోట్ల జరిగిన ఘటనలు గురించి ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది వైజాగ్ లో ఎస్సీ వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ కి జరిగిన అన్యాయం మరువక ముందే అదే నగరం లో ఒక ఎస్సీ యువతి పట్ల పోలీసుల వేధింపులు వెలుగులోకి వచ్చాయి అని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి పై ప్రభుత్వానికి చిన్న చూపు తగదు అంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మరొకసారి వైసీపీ పాలన విధానం పై చేసిన విమర్శల తో ఆ పార్టీ కి చెందిన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.