బాబుగారి ఓదార్పుల పర్వం మెల్లగా యాత్రలా మారుతుందా ?

Tuesday, June 11th, 2019, 01:36:34 PM IST

చంద్రబాబుగారు ఎన్నికల్లో ఓడిపోవడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే బాబుగారి నివాసానికి క్యూ కట్టి ఆయన్ను ఓదారుస్తున్నారు. ఇది ప్రస్తుతం టీడీపీలో ఒక వర్గం చేస్తున్న హడావుడి. ఫలితాలు వెలువడిన పక్కరోజు నుండి రాష్ట్రంలో ఉన్న టీడీపీ అభిమానులు చంద్రబాబు నివాసానికి యాత్ర స్టార్ట్ చేశారు. విడతలవారీగా, ఒక పద్దతి ప్రకారం రోజుకు ఒక్కో ప్రాంతం నుండి జనం చంద్రబాబు ఇంటికి చేరుకొని ఆయన్ను చూసి ఓదార్చిపోతున్నారు.

మహిళలైతే మీరు ఓడిపోవడం ఏమిటి బాబు అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. బాబుగారేమో వారికి భాధపడొద్దు, కష్టపడి పనిచేసి పార్టీని నిలబెట్టాలి అంటూ దైర్యం చెప్పి పంపిస్తున్నారు. ఈ పద్దతిని చూస్తే ఈ ఒడార్పులా పర్వం త్వరలోనే ఒక ఉద్యమంలా మారే ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు నేతలే ప్రజల వద్దకు వెళ్లి, వారి బాధల్ని తెలుసుకుని ఓదార్చేవారు, భరోసా ఇచ్చేవారు. కానీ టీడీపీ వ్యవహారం చూస్తే అలా లేదు. జనమే చంద్రబాబు వద్దకు యాత్రలా వచ్చి ఆయన్ను ఓదార్చి, ఈసారి గెలుపు మనదే అంటూ మాటిచ్చి వెళ్లే కొత్త పద్దతి వస్తుందేమో అనే అనుమానం వస్తోంది.