ఎయిర్ పోర్టులో చంద్రబాబుకి ఘోరమైన అవమానం…

Saturday, June 15th, 2019, 01:13:33 AM IST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఘోరమైన అవమానం జరిగింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ కి తిరిగొస్తున్న చంద్రబాబుని అక్కడి విమానాశ్రయ సిబ్బంది చాలాసేపు చెక్ చేసి పంపించారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు కి సంబందించిన వాహనాలను కూడా విమానాశ్రయం లోనికి అనుమతించలేదు. ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి విమానం వరకు చంద్రబాబునాయుడు కూడా ప్రయాణికుల బస్సులోనే వెళ్లారు. వీఐపీ, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబునాయుడుకు కనీసం వాహనం కూడా కేటాయించకపోవడం వివాదాస్పదంగా మారింది.

భద్రతా సిబ్బంది అందరిలాగే చంద్రబాబు ని కూడా అలాగే తనిఖీ చేయడం అనేది దురదృష్టకరం అని చెప్పాలి. అంతేకాకుండా ఇటీవల చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించారు. ఆయన కాన్వాయ్‌లో పైలెట్‌, ఎస్కార్ట్‌-1, ఎస్కార్ట్‌-2, జామర్‌, వీఐపీ స్పేర్‌, ఎన్‌ఎస్‌జీ-1, ఎన్‌ఎస్‌జీ-2 ఇలా మొత్తం 8 వాహనాలతో కాన్వాయ్‌ ఉండాలి. చంద్రబాబు కాన్వాయ్లో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉన్నా సెక్యూరిటీ ఎస్‌ఆర్టీలో భద్రతా సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలి. ఇవేమీ లేకుండానే చంద్రబాబుకు పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనంతోపాటు ఎస్కార్ట్‌ అధికారి వాహనాన్ని తప్పించారు. ఎంతైనా చంద్రబాబు అధికారం కోల్పోవడంతో అందరు కూడా చులకనగా చూస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…