చంద్రబాబు పర్యటనలోనే కనిపించని సొంత నేతలు

Tuesday, July 9th, 2019, 08:00:43 PM IST

ఏపీలో జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఓటమిని చవిచూసాక, టీడీపీ పరిస్థితి ఏపీలో దాదాపు చాలా దారుణంగా తయారయిందని అర్థమవుతుంది. అంతేకాకుండా ఏపీలో టీడీపీ పార్టీ ఒకరకముగా మునిగిపోయిందని చెప్పాలి. అయితే అలంటి టీడీపీ పార్టీని మళ్ళీ గాడిన పెట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్న సంగతి మనకు తెలిసిందే. దానికి తోడు టీడీపీ నుండి వలసలు ఈ మధ్యన ఎక్కువయ్యాయి కూడా. ఇప్పటికి కూడా టీడీపీ పార్టీ ని వదిలి వేరే పార్టీలో చేరేందుకు చాలా మంది నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి చంద్రబాబు వారందరిని కూడా బుజ్జగించే పనిలో ఉన్నారని సమాచారం. చంద్రబాబు ఒకవైపు వారందరిని బుజ్జగిస్తునే, మరొకవైపు నిరాశలో ఉన్నటువంటి నేతలందరిలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు చంద్రబాబు నాయుడు ఎన్నికల తరువాత తన సొంత జిల్లా అయిన కుప్పంలో పర్యటిస్తూ అక్కడ నేతలందరితో, పార్టీ శ్రేణులందరితో కలిసి చర్చలు జరిపారు. అయితే అక్కడి నేతలు మాత్రం చంద్రబాబు పర్యటనలో కనిపించడం లేదని సమాచారం.

ఏపీలో అధికారం కోల్పోయాక సొంత జిల్లాకి చెందిన నేతలు కూడా చంద్రబాబుకి దూరంగా ఉంటున్నారు అని తెలుస్తుంది. అంతేకాకుండా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామై పనులన్నీ చేసిన నేతలందరూ కూడా ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోయాకే అందరు దూరమవుతున్నారని చంద్రబాబు కాస్త ఆవేదన చెందుతున్నారని సమాచారం. అయితే ఈ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు తప్ప ఎవరు కనిపించడం లేదని, అయితే ఈ సమయంలో చంద్రబాబుకి వెనకాల ఉండాల్సిన కార్యకర్తలందరు కూడా కనిపించకపోవడంతో ఈ విషయం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.