వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు ?

Thursday, January 18th, 2018, 10:11:48 AM IST

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వారసత్వ పరంపర కొనసాగుతుందని, ఇది చిత్ర పరిశ్రమ మనుగడకే ప్రమాదకరమని సంచలన వ్యాఖ్యలు చేసారు సీనియర్ నటుడు చంద్రమోహన్ ? తాజాగా అయన సంక్రాంతి వేడుకల సందర్బంగా నర్సీపట్నం లో జరిగిన ఉత్సవాలలో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ సినీ రంగంలో వారసత్వం మాత్రమే కొనసాగుతుందని, కొత్తగా వచ్చిన వారిని ఎదగనివ్వడం లేదని విమర్శించారు !! ప్రస్తుతం వస్తున్నా సినిమాల్లో కథలు , కథనాలు ఏమి బాగా ఉండడం లేవని, కొత్తగా ఎందరో నటీనటులు వస్తున్నారని, వారిని సరిగ్గా ప్రోత్సహించడం లేదని, పైగా టాలెంట్ లేకున్నా తమ వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇక్కడ మంచి టాలెంట్ ఉన్న తెలుగు నటులు ఉన్నా కూడా విలన్ పాత్రలకు పరభాషా నటులకు ప్రాధాన్యం ఇస్తున్నారని, ఈ విషయం తనకు బాధను కలిగిస్తుందని అన్నారు. మరి చంద్రమోహన్ కామెంట్స్ తో ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.