ఏలేటి.. గోపీచంద్‌తోనా? నితిన్‌తోనా?

Sunday, June 3rd, 2018, 12:11:11 PM IST

చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి.. ఈ పేరు విన‌గానే ప్ర‌యోగాలే గుర్తుకొస్తాయి. అంద‌రిలా కాకుండా త‌న‌కంటూ ఓ స‌ప‌రేట్ రూటు ఉంద‌ని నిరూపించిన ద‌ర్శ‌కుడు. ఆయ‌న తెర‌కెక్కించిన ఐతే, సాహ‌సం, అన‌గ‌న‌గ ఒక రోజు, మ‌న‌మంతా చిత్రాలే అందుకు సాక్ష్యం. ప్ర‌స్తుతం అత‌డు ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్‌తో సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని వార్త‌లొచ్చాయి.

అయితే తాజాగా అత‌డు నైజాం మెగాస్టార్ నితిన్‌కి క‌థ వినిపించి ఓకే చేయించుకున్నాడ‌ని తెలుస్తోంది. నితిన్ `శ్రీ‌నివాస క‌ళ్యాణం` రిలీజైతే, ఈ కొత్త ప్రాజెక్టుపై పూర్తి క్లారిటీవ చ్చే వీలుందిట‌. ఇక‌పోతే ఏలేటి ముందుగా ఎవ‌రితో మొద‌లు పెడ‌తాడు? గోపిచంద్ లేదా నితిన్‌.. ఇద్ద‌రిలో ఎవ‌రితో ముందు? అన్న‌ది మాత్రం తేలాల్సి ఉంటుంది. జూలై 21న శ్రీనివాస క‌ళ్యాణం రిలీజ్ ..అన్నారు కానీ ఆగ‌ష్టుకి వాయిదా ప‌డుతోంది. ఆ క్ర‌మంలోనే నితిన్ సినిమా ఆల‌స్యం కావొచ్చ‌న్న సందేహాలు ఉన్నాయి. ఈలోగానే గోపిచంద్‌తో ఏలేటి సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంటుంద‌న్న‌మాట‌!