`చంటిగాడు` హీరోయిన్‌ పెళ్లికూతురాయెనే!

Friday, November 25th, 2016, 05:33:41 PM IST

heroin
`చంటిగాడు` సినిమాతో క‌థానాయిక‌గా తెలుగు యువ‌త మ‌నసు దోచిన సుహాసిని ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల్లో నాయిక‌గా న‌టించింది. అటుపై బుల్లితెర‌, వెండితెర రెండుచోట్లా నాయిక‌గా సెట్ట‌య్యింది. సుహాసిని త‌న కొలీగ్‌, టీవీ న‌టుడు ధ‌ర్మారావు (రాజ్)ను గురువారం ఉద‌యం వివాహ‌మాడారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల‌ స‌మ‌క్షంలో హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ఓ ఫంక్ష‌న్ హాలులో ఈ పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది.

ఈ వివాహ వేడుక‌కు ప‌లువురు బుల్లితెర న‌టీన‌టులు, స్నేహితులు, స‌న్నిహితులు హ‌జ‌ర‌య్యారు. సుహాసిని తెలుగుతో పాటు ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ అవ‌కాశాలు అందుకున్నారు. త‌మిళం, క‌న్న‌డం, భోజ్ పురీలోనూ న‌టించి మెప్పించారు. ప్ర‌స్తుతం ఈ యువ జంట ప‌లు బుల్లితెర సీరియ‌ల్స్ లో క‌లిసి న‌టిస్తున్నారు.⁠⁠⁠⁠ మొత్తానికి చంటిగాడు హీరోయిన్ పెళ్లి కూతురైంది.