19 నుండే చరణ్ – బోయపాటిల షూటింగ్

Wednesday, January 17th, 2018, 07:07:21 PM IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో అయన నెక్స్ట్ సినిమాకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే బోయపాటి శ్రీను తో సినిమా కన్ఫర్మ్ చేసిన చరణ్ ఎల్లుండి నుండి అంటే ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ కావడంతో పాటు చరణ్ రంగస్థలం షూటింగ్ ముగియడంతో ఈ సినిమాకు రెడీ అయ్యారు. మాస్ యాక్షన్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాలో చరణ్ ఊరమాస్ గా ఇమేజ్ తెచ్చుకుంటాడట. మరి టైటిల్ కూడా ఊరమాస్ అని పెడతారో ఏమిటో ? త్వరలోనే హీరోయిన్ , మిగతా వివరాలు ప్రకటిస్తారట.